మే 3 నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌

-

సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధం అవుతోంది. ఈ క్రమంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటింగ్‌ ప్రక్రియ వచ్చే నెల 3వ తేదీన ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగులు, కేంద్ర సర్వీసుల్లో పని చేసే సిబ్బంది, దివ్యాంగులు, 85 సంవత్సరాలు దాటిన వయోవృద్ధులకు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే.

ఈ అవకాశం ఎంచుకున్న దివ్యాంగులు, వయోవృద్ధులు మాత్రమే పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. మే 3న ఈ ప్రక్రియ ప్రారంభం కానున్న ఈ ప్రక్రియ ఎనిమిదో తేదీలోగా పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. సాధారణ పోలింగ్‌ తేదీ కన్నా నాలుగు రోజుల ముందుగానే ఇది పూర్తి చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ నెల 30 నుంచి  పోస్టల్‌ బ్యాలెట్‌ ముద్రణ మొదలుపెట్టి వచ్చే నెల రెండో తేదీలోగా పూర్తి చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news