స్టేట్ చాపర్ లో ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్.. డ్రైవర్ సస్పెండ్

Join Our Community
follow manalokam on social media

ప్రీ వెడ్డింగ్ షూట్లు రోజు రోజుకీ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. తీయకూడని చోట్ల తీయకూడని విధంగా ఫోటోలు తీసుకోవడం సాధరణం అయిపోయింది. పెళ్ళికి ముందు ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ల సాంప్రదాయం బాగా పెరిగిపోవడంతో దాని గురించి వార్తలు ఎక్కువవుతున్నాయి. తాజాగా చత్తీస్ ఘడ్ లో ఏవియేషన్ లో ప్రీ వెడ్డింగ్ షూట్ జరిగింది. నిజానికి అక్కడ ఫోటో షూట్ చేయడానికి అనుమతి లేదు. కానీ, డ్రైవర్ యోగేశ్వర్ సాయి అనుమతి తీసుకోకుండానే అతని ఫ్రెండ్ ని ఫోటో షూట్ కి తీసుకెళ్ళాడు.

అక్కడ ఉన్న గార్డు అడిగితే తెలిసిన వాళ్ళే అని చెప్పడంతో గార్డు కూడా ఏమీ అనకుండా ఉండిపోయాడు. జనవరి 20వ తేదీన ఈ ప్రి వెడ్డింగ్ షూట్ జరిగింది. ఇటీవల ఈ ఫోటోలు ఫేస్ బుక్ లో కనిపించడంతో ఈ చర్యకి పాల్పడిన యోగేశ్వర్ సాయిని సస్పెండ్ చేసారు. ఏవియేషన్ నియమాలని ఉల్లంఘించినందుకు డ్రైవర్ పై చర్యలు తీసుకుంటూ సస్పెండ్ చేసారు. ఈ మేరకు పోలీసులు ఈ సమాచారాన్ని అందించారు.

TOP STORIES

EPF: ఏప్రిల్ 1 నుండి కొత్త రూల్స్… వివరాలు ఇవే…!

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ అనేది జీతం ఉన్న వ్యక్తుల కోసం ప్రభుత్వ యాజమాన్యం తో నడిచే పెన్షన్ ప్లాన్. దీంతో ప్రతి నెల 12...