కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులు ఇరు సభల్లో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఈ బిల్లుల వల్ల వ్యవసాయదారులకి డైరెక్టుగా కార్పోరేట్లతో సంబంధం ఏర్పడుతుందని, మధ్యవర్తులు ఉండరని కేంద్రప్రభుత్వం చెబుతుంది. మరోపక్క రైతులుఈ బిల్లుల వల్ల రైతులకి నష్టం కలుగుతుందని, కనీస మద్దతు ధర తగ్గుతుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా చోట్ల బిల్లులకి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రస్తుతం వ్యవసాయ బిల్లులకి రాష్ట్రపతి ఆమోదం పొందాల్సిన అవసరం ఉంది. ఐతే వ్యవసాయ బిల్లులపై వ్యతిరేకంగా పంజాబ్ రైతులు నేటి నుండి మూడు రోజుల పాటు రైల్ రోకో చేపట్టనున్నారు. సెప్టెంబర్ 24నుండి 26వరకు రైల్ రోకో చేపట్టనున్నారు. ఈ మేరకు ప్రతిపక్ష పార్టీలు రైతులకి అండగా నిలుస్తున్నాయి.