కరోనా వ్యాక్సిన్ తయారీలో మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ లోకి ఎంటర్ అవుతున్నామంటూ జాన్సన్ అండ్ జాన్సన్ బుధవారం ప్రకటించింది. మొదటి రెండు ట్రయల్స్ విజయవంతంగా పూర్తయినందున మూడవ దశ ట్రయల్స్ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో 60వేల మందికి పైగా వాలంటీర్లని సెలెక్ట్ చేయనున్నారట. అమెరికా సహా ఇతర దేశాల వాలంటీర్లను ఇందులో భాగస్వామ్యం చేయనున్నారు.
ఈ వ్యాక్సిన్ తయారీకి అమెరికాకి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అనే సంస్థ నిధులు సమకూరుస్తుంది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా కోవిడ్ నియంత్రణకి కరోనా వ్యాక్సిన్ తయారు చేయడం కోసం జాన్సన్ అండ్ జాన్సన్ అనుక్షణం పనిచేస్తుందని తెలిపింది. ఐతే ప్రపంచంలో కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తున్న కంపెనీల్లో మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ చేపడుతున్న పదవ సంస్థగా జాన్సన్ అండ్ జాన్సన్ గుర్తింపు తెచ్చుకుంది. అమెరికాలో ఇది నాలుగోస్థానంలో ఉంది.