22వ రోజుకు చేరుకున్న రాహుల్ గాంధీ పాదయాత్ర

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన ” భారత్ జోడో” పాదయాత్ర 22వ రోజుకు చేరుకుంది. ఇప్పటివరకు ఈ పాదయాత్ర 450 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. నేడు రాహుల్ గాంధీ నియోజకవర్గమైన వయోనాడ్ కు ఈ పాదయాత్ర చేరుకుంది. నేడు నీలంబుర్ లోని చుంగతార నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభమైంది. సెప్టెంబర్ 10వ తేదీన తమిళనాడు నుంచి కేరళలోకి ప్రవేశించిన ఈ యాత్ర రేపు కర్ణాటక కు చేరనుంది. రాహుల్ పాదయాత్రకు భారీగానే స్పందన వస్తుంది.

విద్యార్థులు, వివిధ పార్టీల నేతలు, ప్రజా ప్రతినిధులు ఈ యాత్రలో రాహుల్తో కలిసి నడుస్తున్నారు. ఈ పాదయాత్ర కర్ణాటకలో 19 రోజుల వ్యవధిలో ఏడు జిల్లాల మీదుగా 450 కిలోమీటర్ల మేర సాగనంది. అనంతరం అక్టోబర్ 24న ఈ పాదయాత్ర తెలంగాణలో కొనసాగనుంది. మహబూబ్నగర్ జిల్లాలోని మక్తల్ లో ప్రవేశించిన ఈ పాదయాత్ర తెలంగాణలో 366 కిలోమీటర్ల మేర సాగనుంది. మొత్తం నాలుగు నియోజకవర్గాలలో ఈ యాత్ర సాగనుంది.