రైతులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది నైరుతి రుతుపవన కాలంలో తక్కువ వర్షాలు కురుస్తాయని స్కైమెట్ సంస్థ అంచనా వేసింది. వర్షాలు తక్కువగా కురిస్తే ఇది దేశ వ్యాప్తంగా రైతాంగంపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఫసిఫిక్ సముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఈసారి రుతుపవనాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో వర్షాలు తక్కువగా పడే అవకాశం ఉంది.
గత రెండేళ్లలో ‘ లానినో’ ప్రభావం వల్ల 2020,21 సంవత్సరాల్లో వర్షాలు ఎక్కువగా కురిశాయి. ఈ ఏడాది ఆప్రభావం లేదని.. స్కైమెట్ అంచనా వేసింది. అయితే జూన్ లో మంచి వర్షాలు కురిసి.. జులై, ఆగస్టు మాసాల్లో మాత్రం తక్కువ వర్షాలు కురుస్తాయని ఇస్రో చెబుతోంది.
దేశంలో రుతుపవన వ్యవస్థయే వర్షాలకు మూలాధారం. ముఖ్యంగా నైరుతి రుతుపవన కాలంలోనే ఎక్కువగా వర్షాలు కురుస్తాయి. పంటలకు నైరుతి రుతుపవనాలు కీలకంగా ఉంటాయి. దేశంలో రుతుపవనాలు వర్షాలను ‘ఎల్ నినో’, ‘లానినో’ అనే రెండు ప్రభావాలు ప్రభావితం చేస్తాయి. ఎల్ నినో ఉన్నప్పుడు దేశంలో తక్కువ వర్షపాతం, కరువు పరిస్థితులు సంభవించాయి. ఇదే లానినో ఏర్పడితే.. వర్షాలు విస్తారంగా కురుస్తాయి.