World Cup 2023: టీమిండియాపై సంచలన ఆరోపణలు….ఫిక్సింగ్ జరుగుతుంది !

-

World Cup 2023: టీమిండియాపై సంచలన ఆరోపణలు వస్తున్నాయి. ఫిక్సింగ్ జరుగుతోందని కూడా చెబుతున్నారు. టీమిండియా వరుస విజయాలు సాధిస్తుండటంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ హసన్ రజా సంచలన వ్యాఖ్యలు చేశారు. మిగతా జట్ల బౌలర్ల కంటే టీమిండియా బౌలర్లకు చాలా సింగ్ లభిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Raza Hasan comments on team india

ఐసీసీ మరియు బీసీసీఐ భారత బౌలర్లకు ప్రత్యేక రూల్స్ ఇస్తున్నట్లు అనిపిస్తోందని ఆరోపణలు చేశారు. అందుకే వాళ్ళు బ్యాటింగ్ పిచ్ పైన కూడా వికెట్లు సాధిస్తున్నారన్నారు. DRS కూడా వారికి అనుకూలంగా వస్తోంది దీనిపై విచారణ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు హసన్ రాజా. దీంతో హసన్ రజా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారాన్ని లేపుతున్నాయి. కాగా ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్ లో టీమిండియా మరోసారి తన సత్తాను చాటింది. శ్రీలంక జట్టుపై ఏకంగా 302 పరుగుల తేడాతో విజయం సాధించింది టీమిండియా. ముంబైలోని వంఖాడే వేదికగా ఈ మ్యాచ్ లో అద్భుత విజయం సాధించి నేరుగా సెమిస్ కు చేరింది టీమిండియా జట్టు.

Read more RELATED
Recommended to you

Latest news