కొత్త 100నోట్ల‌ను తెస్తున్న ఆర్బీఐ.. ఈ నోట్లు చిర‌గ‌వంట‌!

ఇప్ప‌టికే రూ.1000 నోట్ల‌ను ర‌ద్దు చేసిన కేంద్ర ప్ర‌భుత్వం వాటి ప్లేస్‌లో రూ.2వేల నోట్లు తెచ్చింది. అలాగే పాల రూ.500, రూ.100నోట్ల‌ను ర‌ద్దు చేసి వాటి ప్లేస్‌లో కొత్త నోట్ల‌ను తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు ఉన్న రూ.100నోట్లను కూడా ర‌ద్దు చేసి వాటి ప్లేస్‌లో కొత్త వాటిని తీసుకొస్తోంది ఆర్బీఐ. అయితే ఈ వార్త విని ఆనందపడేవారి కంటే.. ఆశ్చర్యపోతున్నవారే ఎక్కువగా ఉంటున్నారు.

అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న నోట్లు ఎక్కువ కాలం మ‌న్నిక‌లో ఉండ‌లేవు. కానీ ఈ సారి తెచ్చే నోట్లు మాత్రం ఎక్కువ కాలం గ‌ట్టిగా ఉంటాయ‌ని ఆర్బీఐ ఆఫీస‌ర్లు చెబుతున్నారు. పైగా ఈ నోట్లు చిరగవు, ఈజీగా కట్ అవ్వవు.

ఇప్పుడు వంద నోటే కొత్తది ఎందుకు తెస్తున్నారంటే మన దేశంలో రూ.2,000, రూ.500 నోట్ల కంటే… రూ.100 నోటే ఎక్కువగా వాడుకలో ఉంది. కాబ‌ట్టి ఈ నోట్లు ఎక్కువ కాలం ఉప‌యోగంలో ఉండే విధంగా కేంద్రం కొత్త నోట్ల‌ను తెస్తోంది. ఇక కొత్త నోటు కూడా ఇప్పుడున్న పర్పుల్ కలర్ నోట్ లాగే ఉంటుంది. ఈ నోట్ల‌పై ఓ స్పెషల్ ఫీచర్ ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ మొత్తం 100 కోట్ల రూ.100 నోట్లను ప్రింట్ చేసి తెస్తోంది. ఈ నోట్లపై వార్నిష్ కోటింగ్ ఉంటుంది. అందువల్ల ఇవి సేఫ్‌గా, ఎక్కువ కాలం మ‌న్నిక‌లో ఉంటాయ‌ని ఆర్బీఐ చెప్పింది.