రిపబ్లిక్ డే 2021 : 72వ గణతంత్ర దినోత్సవ విషెస్ ని ఇలా స్పెషల్ గా చెప్పుకోండి…!

-

స్వతంత్ర భారతా వనిలో అతి ముఖ్యమైన రోజు ఇది. మన కోసం ఎంతో మంది వీరులు అనేక కష్టాలు ఎదుర్కొని పోరాడారు. రాజ్యాంగం రచించడానికి ఒక కమిటీ ఏర్పాటైంది. అంబెడ్కర్ ఛైర్మన్ గా ముసాయిదా కమిటీ ఏర్పాటైంది. 1949 నవంబరు 26న రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించింది. 1950 జనవరి 26వ తేదీ నుంచి మన రాజ్యాంగం అమలు లోకి వచ్చింది. తద్వారా భారత్ ‘సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్య’ రాజ్యంగా అవతరించింది. ప్రతి ఏటా జనవరి 26ను గణతంత్ర దినోత్సవం గా జరుపుకుంటున్నాం.

గణతంత్ర దినోత్సవం నాడు మనమంతా భారతీయులం అని గర్వంగా చాటుకుంటాం. స్నేహితుల తో, కుటుంబ సభ్యులు, బంధువులతో ఇలా ఈ 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ కోట్స్ తో విష్ చెయ్యండి. మరి ఆ కోట్స్ ని మీరు ఇప్పుడే చదివేసి షేర్ చేసేసుకోండి.

– భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచిన భారత గడ్డ మీద పుట్టినందుకు గర్విస్తున్నాను. ఈ గొప్ప దేశంలో పుట్టి ఎందరో ధన్యులయ్యారు.. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ..

– మన దేశాన్ని అత్యుత్తమంగా మారుద్దాం…. శాంతికి, దయకు మారుపేరుగా నిలుపుదాం….
హ్యాపీ రిపబ్లిక్ డే

– మన రాజ్యాంగం మన అందరికీ అమలులోకి అందుబాటులోకి వచ్చిన శుభదినమే..! గణతంత్య్ర దినోత్సవం… మిత్రులకి, శ్రేయాభిలాషులకి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు..

– భారతీయునిగా పుట్టినందుకు గర్వించు… దేశాన్ని ప్రేమించు.. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు..

Read more RELATED
Recommended to you

Latest news