ఎన్నికల తర్వాత పెట్రోవాత… లీటర్ పెట్రోల్ ధర రూ.120కి చేరే అవకాశం

-

రష్యా- ఉక్రెయిన్ యుద్ధం భారత దేశంపై ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా వంట నూనెల రేట్లు పెరిగాయి.  ఈ రెండు దేశాల మధ్య మంటలు మన వంటిళ్లలోకి కూడా పాకాయి. ఇదిలా ఉంటే ఉక్రెయిన్- రష్యాల మధ్య యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ముడిచమురు రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. బ్యారెల్ ముడిచమురు ధర రూ. 115 డాలర్లను చేరింది. దీంతో రానున్న రోజుల్లో చమురు ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ముడిచమురు ఎగుమతిదారుల్లో రష్యా కూడా ఒకటి. ప్రస్తుతం యుద్ధం కారణంగా… ఇతర దేశాల ఆంక్షల కారణంగా ముడిచమురుకు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతుంది.

ఇదిలా ఉంటే దేశంలో మరోసారి పెట్రో వాత తప్పదంటున్నారు నిపుణులు. 5 రాష్ట్రాల ఎన్నికలు ఈనెల 7తో ముగుస్తున్నాయి. దీని తర్వాత పెట్రోల్, డిజిల్ రేట్లు ఖచ్చితంగా పెంచే అవకాశం కనిపిస్తోంది. పెట్రోల్ , డిజిల్ పై రూ. 10 వరకు పెంచే అవకాశం కనిపిస్తోంది. ఈ స్థాయికి ముడిచమురు ధరలు పెరిగితే.. అన్ని సుంకాలు కలిపి పెట్రోల్ ధర రూ. 120-125 కు చేరే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news