మహిళా అధికారిపై ఇసుక మాఫియా దాడి.. విచక్షణారహితంగా కొడుతూ

-

బిహార్​లో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. ఓ మహిళా అధికారిపై విచక్షణారహితంగా దాడి చేసింది. ఆమె వెంటే పోలీసులు ఉన్నా ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి ఇసుక మాఫియాపై విరుచుకుపడ్డారు. మైనింగ్ విభాగం అధికారులపై దాడి చేసిన కేసులో 44 మందిని అరెస్టు చేశారు.

అసలేం జరిగిందంటే.. బిహ్టాలో ఇసుక వ్యాపారులు.. లారీలలో ఓవర్​లోడింగ్ చేస్తున్నారని అధికారులకు సమాచారం అందింది. వెంటనే పట్నా జిల్లా మైనింగ్ విభాగం ప్రధానాధికారి కుమార్ గౌరవ్.. ఇతర అధికారులు, సిబ్బందితో కలిసి రంగంలోకి దిగారు. పోలీసుల అండతో తనిఖీలు చేపట్టారు.

రోడ్డు పక్కన లారీలు ఆపి సోదాలు చేస్తుండగా.. ఇసుక మాఫియా సభ్యులు అక్కడకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. రాళ్లు, కర్రలతో మైనింగ్ విభాగం అధికారులు, పోలీసులపై దాడికి దిగారు. ప్రాణభయంతో పోలీసులు సహా ఇతర అధికారులంతా పరుగులు తీశారు. ఈ ఘటనలో కుమార్ గౌరవ్​తోపాటు మహిళా మైనింగ్ ఇన్స్​పెక్టర్లు ఆమ్యా, ఫర్హీన్​, మరికొందరు గాయపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news