సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐరన్ మ్యాన్..నెహ్రు మానసికంగా బలహీనుడంటూ కంగనా రనౌత్..!

సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖులందరూ ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.అయితే పటేల్ పుట్టిన రోజు సంధర్భంగా బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసింది..వల్లభాయ్ పటేల్‌ను పోగుడుతూనే మరోవైపు గాంధీ, నెహ్రూలపై తన ట్విటర్ ఖాతాలో సంచలన వ్యాఖ్యలు చేసింది..వల్లభాయ్ పటేల్ అసలైన ఉక్కు మనిషని, స్వాతంత్ర్య భారత్‌కు తొలి ప్రధాని అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నకూడా ఆయన కావాలనే తన పదవిని త్యాగం చేశారని పేర్కొంది..అంతే కాకుండా ప్రధాన మంత్రి అయ్యే అవకాశాన్ని మానసికంగా బలహీనుడైన నెహ్రూ కోసం వదులుకున్నాడని తన ట్వీట్‌లలో రాసుకొచ్చింది..ప్రధాని కానందుకు పటేల్ బాధపడలేదని.

అంతేకాకుండా పటేల్ కేవలం గాంధీ నెహ్రూలు ఆనందపెట్టేందుకు తన పదవిని త్యాగం చేశారని, దీంతో దేశం మాత్రం కొన్ని దశాబ్దాలుగా బాధపడుతుందని చెప్పింది..పటేల్ భారతదేశపు నిజమైన ఐరన్ మ్యాన్ అని..గాంధీ మాత్రం బలహీనమైన మనస్సున్న నెహ్రూను ప్రధాని కావాలని కోరుకున్నాడని పేర్కోంది..అయితే గాంధీ మరణించిన తరువాత దేశ పరిస్థితి ఘోరంగా తయారయింద’ని కంగనా చేసిన మరి కొన్ని ట్వీట్‌లలో పేర్కొంది..భారత ఉక్కు మనిషి వల్లభాయ్ పటేల్‌కు జన్మదిన సుభాకాంక్షలు. మాకు ఈ అఖండ భారత దేశాన్ని అందించిన మాహాను భావులు మీరు.. మీ నాయకత్వంలో విడిపోయి ఉన్న 562 రాజసంపద ప్రాంతాలను ఏకం చేసి, అఖండ భారత దేశాన్ని నిర్మించడంతో పాటు దేశ ప్రజలకు స్వతంత్ర భారత దేశాన్ని అందించి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. మీరు దూరమవ్వడం ఈ దేశానికి తీర్చలేని లోటని ..మీ లాంటి గొప్ప నాయకున్ని మా నుంచి దూరం చేయడంపై తీవ్రంగా చింతిస్తున్నామని కంగనా తన ట్వీట్‌లలో పేర్కొంది.