నేడు చెన్నైకు శశికళ.. టెన్షన్ టెన్షన్

Join Our Community
follow manalokam on social media

దాదాపు నాలుగేళ్ల అనంతరం శశికళ నేడు చెన్నై వెళుతున్నారు. దీంతో ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం వర్గాలు ఏర్పాట్లు చేశాయి. ఇక మరో పక్క చిన్నమ్మ వస్తే అడ్డుకొనేందుకు అన్నాడీఎంకే కార్యాలయం, మెరీనా తీరంలోని జయలలిత సమాధి పరిసరాల్ని నిఘా వలయంలోకి తెచ్చారు అధికార పార్టీ నేతలు. అంతే కాక చిన్నమ్మ తమిళనాడులోకి అడుగు పెట్టిన తరువాత ఆమెకు వెయ్యికార్లతో చెన్నై వరకు స్వగతం పలకాలని నిర్ణయించారు. అయితే, జనవరి 27 వ తేదీన బెంగళూరులోకి విక్టోరియా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక జయలలితకు చెందిన లగ్జరీ కారులో చిన్నమ్మ ప్రయాణం చేశారు. 

sasikala

ఆ కారుపై అన్నాడీఎంకే జెండా ఉన్నది.  దీనిపై అన్నాడీఎంకే ఆగ్రహం వ్యక్తం చేసింది.  పార్టీతో సంబంధంలేని వ్యక్తులు పార్టీకి సంబంధించిన జెండాతో ఉన్న కారులో ప్రయాణం చేయడం నేరం అని, దీనిపై చర్యలు తీసుకోవాలని తమిళనాడు రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈరోజు కూడా శశికళ అన్నాడీఎంకే జెండాతో ఉన్న కారుతో తమిళనాడులోకి ప్రవేశిస్తే ఆమెను పోలీసులు అడ్డుకుని, జెండాను తొలగించకుంటే అదుపులోకి తీసుకునే ఛాన్స్ ఉన్నాయని అంటున్నారు. వెయ్యికార్లతో ర్యాలీకి పోలీసులు అనుమతిస్తారా అనేది కూడా అనుమానమే. ఒకరకంగా తమిళ వాసుల్లో టెన్షన్ వాతారవరం నెలకొంది.

TOP STORIES

నీ లోపలి బాధలే కాదు, నీ బయట ఏం జరుగుతుందో తెలుసుకోకుంటే అలాగే మిగిలిపోతావని తెలిపే కథ..

ఒక కొండమీద నివాసముండే అమ్మాయి నీళ్ళకోసం కొండదిగి నది వద్దకు వస్తూంటుంది. భుజం మీద కావిడి పట్టుకుని రెండు కుండల్లో నీళ్ళు పట్టుకుని కొండమీదకి వెళ్తుండేది....