అలెర్ట్… ఈ సమయంలో నిలిచిపోనున్న ఎస్‌బీఐ సేవలు

 

ప్రభుత్వ బ్యాంకింగ్ సంస్థ అయిన ఎస్‌బీఐ తన కస్టమర్లకు కీలక ప్రకటన చేసింది. నిర్వహణ పనుల కారణంగా పలు సేవలకు అంతరాయం కలగనున్నట్లు ఎస్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. జులై 16వ తేదీ (శుక్రవారం) రాత్రి 10.45 గంటల నుంచి మరుసటి రోజు ( శనివారం) ఉదయం 00.15 గంటల వరకు పలు సేవలు నిలిచిపోనున్నట్లు వెల్లడించింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ,యోనో, యోనో లైట్, యూపీఐ సేవలకు అంతరాయం కలగనున్నట్లు తెలిపింది. అంటే మొత్తం 150 నిమిషాల పాటు ఈ సేవలు నిలిచిపోనున్నాయి. కస్టమర్లు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని బ్యాంకు కోరింది. కాగా జులై 10తేదిన కూడా ఎస్‌బీఐ ఇదే సమయంలో రెండున్నర గంటల పాటు తన సేవలు నిలిపివేసిన విషయం తెల్సిందే.

sbi | ఎస్‌బీఐ