భోపాల్ గ్యాస్ బాధితులకు అదనపు పరిహారం.. కేంద్రం అభ్యర్థనకు సుప్రీం నో

-

భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధితులకు అదనపు పరిహారం ఇప్పించాలన్న కేంద్రం అభ్యర్థనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్​ను తిరస్కరించింది. 1984లో జరిగిన ఈ ఘటనలో బాధితులకు.. అమెరికాకు చెందిన యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ నుంచి మరింత పరిహారం ఇప్పించే ప్రయత్నంలో భాగంగా కేంద్రం చేసిన అభ్యర్థనకు సుప్రీం నో చెప్పింది.

భోపాల్ గ్యాస్ బాధితుల కోసం ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ వద్ద రూ.50 కోట్లు ఉన్నాయని గుర్తు చేసింది. ఏవైనా పెండింగ్ క్లెయిమ్​లు ఉంటే ఆ నిధులతో పరిష్కరించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ప్రస్తుతం యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్.. డౌ కెమికల్స్ యాజమాన్యంలో ఉంది.

గ్యాస్ దుర్ఘటన బాధితులకు మరింత సాయం అందించడం కోసం పిటిషన్ వేసింది. దీనిపై జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. ఐదు దశాబ్దాల తర్వాత ఈ సమస్యను తిరిగి లేవనెత్తడం వెనక సరైన కారణాలు కనిపించడం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. దీనిపై దాఖలైన క్యూరేటివ్ పిటిషన్​ను తాము ఆమోదించలేమని స్పష్టం చేసింది. కేంద్రం క్యూరేటివ్ పిటిషన్​పై జనవరి 12న తన తీర్పు రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు తాజాగా దాన్ని చదివి వినిపించింది.

Read more RELATED
Recommended to you

Latest news