లాయర్లపై దావాలు వేయకూడదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు!

-

లాయర్లు ఫీజు తీసుకుని వాదిస్తారని, వారిపై దావా వేయకూడదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సేవల్లో లోపాన్ని ఎత్తిచూపుతూ న్యాయవాదులపై వినియోగదారుల న్యాయస్థానాల (కన్జ్యూమర్ కోర్టు)ల్లో దావాలు వేయకూడదని స్పష్టం చేసింది. లాయర్లు ఫీజు తీసుకుని కేసులు వాదిస్తుంటారు కాబట్టి దాన్ని వినియోగదారుల పరిరక్షణ చట్టం కింద ‘సేవ’గా పరిగణించలేమని పేర్కొంది.

న్యాయవాదులపై కన్జ్యూమర్ కోర్టులలో దావాలు వేయొచ్చంటూ 2007 సంవత్సరంలో జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిథాల్‌లతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. న్యాయవాదులు అందించే సేవలు వినియోగదారుల రక్షణ చట్టం 1986లోని సెక్షన్ 2 (ఓ) పరిధిలోకి వస్తాయని.. వ్యాపారం, వాణిజ్యం నుంచి వృత్తిని వేరు చేస్తూ అప్పట్లో జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ వ్యాఖ్యలు చేసింది. “ఈ తీర్పు వ్యాపారం, వాణిజ్యం నుంచి వృత్తిని వేరు చేసింది. ఒక ప్రొఫెషనల్‌కు ఉన్నత స్థాయి విద్య, నైపుణ్యం, మానసిక శ్రమ అవసరం. వృత్తి నిపుణుడి విజయం వారి నియంత్రణలో లేని వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది” అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

Read more RELATED
Recommended to you

Latest news