ఏడుగురు భారతీయులను విడుదల చేసిన కిడ్నాపర్లు…! తెలుగు వారు కూడా…!

-

లిబియాలో కిడ్నాప్ అయిన ఏడుగురు భారతీయ పౌరులను విడుదల చేసినట్లు ట్యునీషియాలోని భారత రాయబారి ఆదివారం తెలిపారు. భారతదేశానికి లిబియాలో రాయబార కార్యాలయం లేదు. ట్యునీషియాలోని భారత మిషన్ లిబియాలో భారత పౌరుల యోగ క్షేమాలు చూసుకుంటుంది. ట్యునీషియాకు భారత ప్రతినిధి పునీత్ రాయ్ కుండల్ జాతీయ మీడియాకు ఒక ప్రకటనలో తెలిపారు.

గత నెలలో లిబియాలో తమ ఏడుగురు పౌరులను కిడ్నాప్ చేశారని, వారిని విడిపించేందుకు కృషి చేస్తున్నామని భారత్ గత గురువారం ధృవీకరించింది. కిడ్నాప్ చేసిన కార్మికులు సురక్షితంగా ఉన్నారని ప్రకటించారు. అక్కడి భద్రతా పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని భారతీయ పౌరులు లిబియాకు వెళ్లకుండా ఉండటానికి 2015 సెప్టెంబర్‌ లో కొన్ని సూచనలు చేసినా సరే కొందరు పొట్ట కూటి కోసం వెళ్ళారు.

Read more RELATED
Recommended to you

Latest news