భక్తులకు గుడ్ న్యూస్ a.. రాత్రంతా షిర్డీ సాయినాథుడి దర్శనం!

-

దేశవ్యాప్తంగా గురుపూర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలోని షిర్డీ క్షేత్రం ఇవాళ భక్తులతో కిటకిటలాడుతోంది. మూడు రోజుల పాటు జరిగే గురు పూర్ణిమ ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. లక్షలాది మంది భక్తులు సాయిబాబా సమాధి దర్శనం కోసం తరలివచ్చారు.

శనివారం రోజున ప్రారంభమైన సాయి అఖండ పారాయణం ఆదివారం ముగిసింది. పుణె, ముంబయి, నాసిక్ మొదలైన ప్రాంతాల నుంచి వందలాది పల్లకిలు షిర్డీలోకి ప్రవేశించాయి. కాగా, ఈరోజు గురుపూర్ణిమ కావడం వల్ల సాయిబాబా ఆలయాన్ని భక్తుల దర్శనార్థం రాత్రంతా తెరిచే ఉంచుతామని సాయి సంస్థాన్ వెల్లడించింది. ఇది భక్తులకు సువర్ణావకాశం అని పేర్కొంది. దూరప్రాంతాల నుంచి సాయిబాబా దర్శనం కోసం వచ్చిన వారి కోసమే ఈ ఏర్పాటు చేశామని తెలిపింది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో ‍‌గురుపౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో  వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామునుంచే సాయి క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రముఖ ఆలయాల్లో భక్తుల తాకిడితో కోలాహలం నెలకొంది. పూజలు, కీర్తనలతో సాయినాథుని ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. సాయి నామస్మరణతో  బాబా ఆలయాలు మారుమోగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version