దేశంలో ఎక్కడ లేని సంప్రదాయం తెలంగాణలోనే ఉంది : ఈటల రాజేందర్

-

దేశంలో ఎక్కడ లేని సంప్రదాయం కేవలం ఒక్క తెలంగాణలోనే ఉందని మల్కాజ్ గిరి ఎంపీ  ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఇవాళ బోనాల పండుగ సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి అమ్మవారి టెంపుల్ ని సందర్శించారు ఈటల రాజేందర్. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఆషాడ మాసంలో ఆడబిడ్డలందరినీ కూడా తల్లీ తల్లిగారింటికి తోలుకొని వచ్చి ఆ ఆడబిడ్డను గౌరవించుకొని పసుపు బియ్యం పెట్టుకొని ఆడబిడ్డల ఆశీర్వాదం తీసుకొని గౌరవించుకొనే సనాతన సంప్రదాయం దేశంలో ఎక్కడ లేదు. అది కేవలం తెలంగాణ ప్రాంతం లో మాత్రమే ఉంది. బతుకమ్మను ఆడుకున్న లక్ష్మీ దేవతలాగా ఆ పండుగను  కూడా ఇలాగే మళ్లీ పూజించుకుంటాం.

దసరా పండుగను కూడా కుటుంబ సమేతంగానే జరుపుకుంటాం.    తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ చల్లగా ఉండాలని, మంచి వర్షాలు పడి పాడి పంటలతో రైతులు సంతోషంగా ఉండాలని కోరారు. అలాగే  ఏ బాధలు లేకుండా, ఏ రోగాల బారిన పడకుండా ప్రజలందరినీ కూడా చల్లగా దీవించమని అమ్మవారికి మొక్కులు చెల్లించినట్టు తెలిపారు ఎంపీ ఈటల రాజేందర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version