BREAKING : అమెరికా వెళుతున్న భారతీయ విద్యార్థులకు షాక్‌..!

-

అమెరికా వెళుతున్న భారతీయ విద్యార్థులకు బిగ్‌ షాక్‌ తగిలింది. అమెరికా వెళుతున్న భారతీయ విద్యార్థుల్లో సరికొత్త టెన్షన్ నెలకొంది. అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారుల తీరుతో విద్యార్థులు, తల్లిదంద్రుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ కారణం లేకుండానే విద్యార్థుల్ని వెనక్కు పంపుతున్నారు అధికారులు. యూనివర్శిటీలనూ సంప్రదించకుండానే పంపేస్తున్నారు అమెరికన్ అధికారులు.

ఒక్కసారి వెనక్కు పంపితే ఐదేళ్ల పాటు మళ్లీ అమెరికాలోకి నో ఎంట్రీ అనే నిబంధన కూడా అమలు చేస్తున్నారు. ఇక తాజాగా మరో 16 మంది విద్యార్థులను వెనక్కు పంపేశారు అట్లాంటా అధికారులు. గత రెండ్రోజుల క్రితం 40 మందిని వెనక్కు పంపేసిన అధికారులు.. వచ్చే 10 రోజుల్లో మరికొద్ది మందిని పంపేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. విద్యార్థులకు అవసరమైన F1 వీసా ఉన్నా కానీ అధికారులు పట్టించుకోవడం లేదు. అమెరికాలో ఉద్యోగాల కోసం నకిలీ డాక్యుమెంట్లతో వస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news