BREAKING : సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురు

-

సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురు అయింది. తన పిటిషన్ ను త్వరగా విచారించాలన్న కవిత అభ్యర్థులను తిరస్కరించింది సుప్రీం కోర్టు. ఈ నెల 24వ తేదీనే విచారిస్తామని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు. దీంతో సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురు అయింది.

కాగా, ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈనెల 20న విచారణకు హాజరుకావాలని నోటీసులలో పేర్కొంది. షెడ్యూల్ ప్రకారం ఈరోజు కవిత ఈ డి విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఆమె హాజరు కాలేదు. ఆమెను ఈనెల 11న సుమారు 8 గంటల పాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు.. ఈ నెల 16న మరోసారి రావాలని అదే రోజు సమన్లు జారీ చేశారు.

ఈ సమన్లను రద్దు చేయాలని ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఈ వాజ్యాన్ని విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం.. తక్షణమే విచారణ జరిపేందుకు నిరాకరించింది. దీంతో నేడు విచారణకు హాజరు కావాల్సి ఉండగా న్యాయనిపునులతో చర్చించిన అనంతరం ఆమె విచారణకు రాలేనని తేల్చి చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news