నూడిల్స్ ప్రియులకు షాకింగ్ న్యూస్.. ఇకమీదట డిమాండ్ పెరగనుందా?

-

ఆరొగ్యాన్ని ఇచ్చే ఆహారాన్ని తీసుకోవడం ఈతరం పిల్లలు అలవాటు లేదు..నోటికి రుచిగా ఉండి, ఆరోగ్యం పై ప్రభావాన్ని చూపే ఫాస్ట్ ఫుడ్ లకు ఎక్కువ లైక్ చేస్తున్నారు.ఇంట్లో నుంచి కాలు బయట పెడితే వీధికి ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దర్శన మిస్తుంది..నూడుల్స్ అనే ఫుడ్ మాత్రం ప్రతి ఒక్కరికి రుచి చూపించింది. సన్నగా, పొడవుగా తీగవలె ఉండే ఈ నూడుల్స్ రుచికి బాగా స్పైసీగా ఉంటూ అందరికీ నోరూరిస్తుంది. ఇవి కూడా రోడ్లపై బాగా దొరుకుతుంది. దీంతో ప్రపంచంలో నూడుల్స్‌కు విపరీతమైన అభిమానులు ఉన్నారు.

 

మీరు కూడా నూడిల్స్ ను ఎక్కువగా తింటున్నారా.. అయితే మీకు షాకింగ్ న్యూస్.. ప్రపంచవ్యాప్తంగా నూడుల్స్ సంక్షోభం పెరుగుతోంది. ఫలితంగా నూడుల్స్‌ ధర నిరంతరం పెరుగుతోంది. నూడుల్స్‌ ధరలు పెరగడానికి కారణం ప్రపంచంలో గోధుమల ధర పెరగడం, విద్యుత్, రవాణాపై ఖర్చులు పెరగడం. రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంగా తెలుస్తోంది. ఇది కాకుండా, గత సంవత్సరం కరువు, వరదలు,కరోనా కారణంగా చైనా గోధుమ ధరలో 30 శాతం వరకు పెరిగింది.

చైనా, రెండేళ్లలో తీవ్రమైన ఆహార ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందడం, సరఫరాలో అవాంతరాల కారణంగా గోధుమ ధరలు ఇప్పటికే గణనీయంగా పెరిగాయి..నూడిల్స్ తయారికి గోధుమలు ప్రధానం..వీటికి డిమాండ్ పెరగడానికి నూడిల్స్ తగ్గడానికి ఒక అనుబంధం ఉంది.గోధుమల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. అతని ప్రకారం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇంకా ముగిసే సూచనలు కనిపించడం లేదు, అందుకే నూడుల్స్ సంక్షోభం కొనసాగుతుందని కొందరు ప్రముఖులు అభిప్రాయ పడుతున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news