రాహుల్ గాంధీతో సిద్దరామయ్య భేటీ

-

కర్ణాటక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దరామయ్య పేరు దాదాపుగా ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం లోగా అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే సిద్ధరామయ్య ఇంటి వద్ద పోలీసు భద్రత పెంచడంతో ఆయనే ముఖ్యమంత్రి అని అందరూ అనుకుంటున్నారు. నూతన ముఖ్యమంత్రిగా రేపు సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు సిద్ధరామయ్య. ఆయనే ముఖ్యమంత్రిగా ఖరారు చేసినట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో రాహుల్ తో సమావేశం అయిన సిద్ధరామయ్య.. అనంతరం సోనియా గాంధీని కలవడానికి ఆమె నివాసానికి వెళ్లారు. దీంతో గత నాలుగు రోజులుగా జరిగిన నాటకీయ పరిణామాలకు తెరపడినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news