చాలామంది బీపీ సమస్యతో బాధపడుతూ ఉంటారు మీరు కూడా బీపీ సమస్యతో బాధ పడుతున్నారా అయితే కచ్చితంగా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. వ్యాయామ పద్ధతుల్ని పాటిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది చాలా మంది రకరకాల వ్యాయామాలను చేస్తూ ఉంటారు అయితే హైపర్ టెన్షన్ ని కంట్రోల్ చేయడానికి కొన్ని వర్కౌట్స్ బాగా సహాయపడతాయి మరి వాటి కోసం చూద్దాం.. బీపీ తో బాధపడే వాళ్ళు రోజు వాకింగ్ చేస్తే చాలా మంచిది రోజు నడవడం వలన రక్తపోటు చాలా వరకు తగ్గుతుంది. హై బీపీని కంట్రోల్ చేయడానికి రోజుకు 30 నిమిషాలు నడిస్తే మంచిది ఒకేసారి కాకుండా రోజుకి మూడుసార్లు పది నిమిషాలు చొప్పున నడవండి అప్పుడు బీపీ కంట్రోల్ లో ఉంటుంది.
బీపీ తో బాధపడే వాళ్ళు స్విమ్మింగ్ చేస్తే కూడా రక్తపోటు బ్యాలెన్స్ అవుతుంది అని ఆరోగ్యనిపుణులు అంటున్నారు 12 వారాలు పాటు రెగ్యులర్ గా స్విమ్మింగ్ చేస్తే బీపీ కంట్రోల్ అవుతుంది రోజుకి 30 నిమిషాల పాటు సైక్లింగ్ చేస్తే కూడా బీపీ కంట్రోల్ అవుతుంది ఇలా ఈ వర్కౌట్స్ ద్వారా బీపీ సమస్య తో బాధపడే వాళ్ళు బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు.
ఎక్సర్సైజులు చేయడం వలన చాలా రకాల సమస్యలు తగ్గుతాయి బరువుని కూడా కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. ఫిట్నెస్ ని కూడా పెంచుకోవచ్చు. అలానే బీపీ సమస్య ఉన్నవాళ్లు ఈ విధంగా చేస్తే బీపీ కూడా కంట్రోల్ అవుతుంది. వీటితో పాటుగా సరైన జీవన విధానాన్ని అనుసరిస్తూ ఉండండి ఆరోగ్యానికి మేలు చూసే ఆహార పదార్థాలని తీసుకోండి. సందేహాలు ఉంటే డాక్టర్ని కన్సల్ట్ చేయండి ఇలా ఈ సమస్యలకి పరిష్కారం లభిస్తుంది ఆరోగ్యంగా ఉండొచ్చు.