జైశ్రీరాం జెండాతో 13 వేల అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్‌

-

ఉత్తర్ ప్రదేశ్లోని అయోధ్యలో రామ మందిరంలో ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమానికి ముహూర్తం సమీపిస్తోంది. జనవరి 22వ తేదీన అంగరంగ వైభవంగా రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి వేద పండితులు, ప్రముఖ రాజకీయ, సినీ, వ్యాపారులు హాజరుకానున్నారు. ఈ అద్భుత ఘట్టం కోసం భారతీయులంతా వేయికన్నులతో వేచిచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్‌కు చెందిన అనామిక శర్మ అనే యువతి ఓ సాహసం చేసింది. అయోధ్య మందిరం చిత్రం, జై శ్రీరామ్‌ అనే నినాదం రాసి ఉన్న జెండాను పట్టుకొని స్కై డైవింగ్‌ చేసింది. బ్యాంకాక్‌లో 13 వేల అడుగుల ఎత్తు నుంచి ఈ సాహసం చేసింది అనామిక. రాముడిపై భక్తి భావాన్ని చాటుకునేందుకు తాను ఈ పని చేసినట్లు అనామిక శర్మ చెప్పుకొచ్చింది. జనవరి 22వ తేదీన రాముడి విగ్రహ ప్రతిష్ఠ జరగనుండగా.. అందుకు సరిగ్గా నెల రోజుల క్రితం(డిసెంబరు 22న) అనామిక ఈ సాహసం చేసింది. ఎయిర్‌ఫోర్స్‌లో పని చేసిన తన తండ్రిని స్ఫూర్తిగా తీసుకొని ఈ సాహసం చేసినట్లు అనామిక శర్మ వెల్లడించింది. ప్రస్తుతం ఈ యువతి సాహసానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version