20 లక్షల ఉద్యోగాల కోసం కష్టపడుతున్న సీఎం చంద్రబాబు..!

-

హౌసింగ్ కాలనీ లబ్దిదారులతో మంత్రి కొలుసు పార్థసారధి, ఎమ్మెల్యే పులివర్తి నాని సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కాలువలు, వీధి లైట్లు, రోడ్డు, రేషన్ షాపు, డ్రైనేజీ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు లబ్దిదారులు. అయితే గత పాలకులు రాష్ట్రాన్ని పూర్తిగా అధోగతి పాలు చేసి, అభివృద్ధికి ఆమడ దూరం నెట్టేశారు అని చెప్పిన మంత్రి.. రూ.10.5 లక్షల కోట్లు అప్పు భారాన్ని టిడిపి ప్రభుత్వం పై పెట్టేశారు. అప్పు చేయడం తప్పు కాదు, తీసుకొచ్చిన డబ్బులు దేనికి, ఎక్కడ, ఎందుకు ఖర్చు పెట్టారో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

బాధ్యతారాహితమైన పరిపాలన మూలంగా రాష్ట్రంలో అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయి. డిప్యూటీ సిఎం పవన్ 3 వేలు కోట్లు తో 30 నుంచి 40 లక్షలతో ప్రతి పల్లెలో సిమెంట్ రోడ్లు వేయిస్తున్నారు. గత ప్రభుత్వం పంచాయతీల నుంచి కూడా డబ్బులు వాడేసుకుంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, ప్రధాని మోడీ సహాకారంతో రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నాం. 20 లక్షల ఉద్యోగాలు సృష్టించి పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి సీఎం కష్టపడుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు కాబట్టి సమయం ఇస్తే అభివృద్ధి జరుగుతుంది అని పార్థసారధి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version