రేపే సూర్యగ్రహణం..  హైదరాబాద్‌లో ఏ టైంలో కనిపిస్తుందంటే..?

-

27 ఏళ్ల తర్వాత రేపు(మంగళవారం) పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. అది కూడా భారత్ లో ఏర్పడనుండటంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  ఇప్పుడు తప్పితే మళ్లీ పాక్షిక సూర్యగ్రహణం 2025 మార్చి 29న చోటు చేసుకోనుంది. కాకపోతే దీన్ని మన దేశంలో వీక్షించలేం. తిరిగి 2032 నవంబర్ 3న ఏర్పడే పాక్షిక సూర్యగ్రహణం మన దేశంలో కనిపిస్తుంది. అందుకే ఈ సూర్యగ్రహణం కొంచెం స్పెషల్ అన్నమాట.

మరి ఇండియాలో ఈ సూర్యగ్రహణం ఎక్కడెక్కడ కనిపిస్తుందంటే..? దేశంలోని పశ్చిమ, మధ్య ప్రాంతాల్లో సూర్యాస్తమయానికి ఒక గంట ముందు కొన్ని నిమిషాల పాటు పాక్షిక సూర్య గ్రహణం కనిపించనున్నట్లు కోల్‌కతాలోని ఎంపీ బిర్లా ప్లానిటోరియం పేర్కొంది. పోరుబందర్, గాంధీ నగర్‌, ముంబయి, శిల్వాసా, సూరత్‌, పనాజీ ప్రాంతాల్లో సూర్యగ్రహణం కనిపించనున్నట్లు తెలిపింది. గరిష్ఠంగా ఒక గంట 45 నిమిషాల పాటు పాక్షిక సూర్యగ్రహణం కనబడుతుందని.. అందులో ఎక్కువ సమయం గుజరాత్‌లోని ద్వారకాలో కనువిందు చేయనుందని వెల్లడించింది. హైదరాబాద్‌లో అయితే సాయంత్రం 4:59 గంటలకు గ్రహణం కనిపించనుంది. కనీసం 49 నిమిషాల పాటు కనివిందు చేయనుంది.

అయితే ఈ సమయంలో 43 శాతం సూర్యుడిని అస్పష్టంగా చూడగలుగుతామని ఎంపీ బిర్లా ప్లానిటోరియం వెల్లడించింది. పాక్షిక సూర్యగ్రహణాన్ని వీక్షించాలనుకునే వారు తప్పనిసరిగా సోలార్ గాగూల్స్ ను ఉపయోగించాలని సూచించింది.

Read more RELATED
Recommended to you

Latest news