4 లక్షలు పెట్టి క్రాకర్స్ కొన్న బండ్ల గణేష్ !

-

ఆయన ఏది చేసినా క్షణాలలో వైరల్ గా మారుతూ ఉంటుంది. మాట్లాడిన, సోషల్ మీడియాలో ట్వీట్ చేసినా, ఓ ఫోటో పోస్ట్ చేసినా.. ఆయన ఎవరో కాదు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బండ్ల గణేష్. ముఖ్యంగా ఈయన ప్రతి దీపావళికి భారీగా క్రాకర్స్ కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే దీపావళికి పేదా, ధనిక తేడా లేకుండా అందరూ తమ శక్తి మేరకు టపాసులు కొనుక్కుంటారు. ఇందులో విశేషం ఏంటంటే.. ఈ దీపావళికి బండ్ల గణేష్ ఏకంగా నాలుగు లక్షల పైనే ఖర్చుపెట్టి దీపావళికి టపాసులు కొనేశారు.

ఈ విషయం తెలుసుకున్న నేటిజన్లు ఆశ్చర్యానికి గురయ్యారు. అట్లుంటది మల్ల బండ్లన్న తోని అంటూ ట్వీట్లు పెడుతున్నారు. అయితే బండ్ల గణేష్ ఈ క్రాకర్స్ కేవలం తనకోసం మాత్రమే కొనలేదని, తన సినీ స్నేహితులకి, బయటి స్నేహితులకి గిఫ్టులుగా అందరికీ పంపిస్తాడని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news