ఇకపై మీ డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల 16 అంకెల నంబర్‌ను గుర్తుంచుకోవాల్సిందే.. ఎందుకంటే..?

Join Our Community
follow manalokam on social media

ఆన్‌లైన్‌లో ఈ-కామర్స్‌ సంస్థలు, ఫుడ్‌ డెలివరీ యాప్‌లను ఎక్కువగా వాడుతున్నారా ? పేమెంట్ల కోసం క్రెడిట్‌, డెబిట్‌ కార్డులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారా ? అయితే ఇకపై మీరు ఆ కార్డులకు చెందిన 16 అంకెల నంబర్లను గుర్తుంచుకోవాలి. అవును. ఎందుకంటే ఆర్‌బీఐ పెట్టిన ఆంక్షలు అలా ఉండబోతున్నాయి. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…

soon you have to remember all your cards details know why

ఆన్‌లైన్‌ మోసాలు, కార్డుల డేటా చోరీ జరుగుతున్న నేపథ్యంలో ఆర్‌బీఐ దేశంలోని ఈ-కామర్స్‌ సంస్థలు, డిజిటల్‌ వాలెట్లు, వీడియో స్ట్రీమింగ్‌ యాప్స్‌, ఫుడ్‌ డెలివరీ యాప్స్‌.. ఇలా ఒకటేమిటి.. ఇలాంటి అన్ని రకాల సంస్థలను వినియోగదారులకు చెందిన క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల డేటాను స్టోర్‌ చేయకుండా ఆంక్షలను విధించనుంది. ఈ మేరకు ఆర్‌బీఐ ఇప్పటికే ఆయా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. దీని వల్ల ఆయా సంస్థలకు చెందిన సైట్లు, యాప్‌లలో వినియోగదారులకు చెందిన డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల వివరాలు స్టోర్‌ కావు. ఫలితంగా వారు ఎప్పుడు కార్డులను వాడినా వాటి పూర్తి వివరాలు.. అంటే.. నంబర్‌, తేదీ, పేరు, సీవీవీ వంటి వివరాలను ఎప్పుడూ ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. దీంతో వినియోగదారులు కార్డు నంబర్లను గుర్తు పెట్టుకోవాలి. లేదా కార్డులను ఎప్పుడూ వెంట ఉంచుకోవాలి.

అయితే ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల క్యాష్‌లెస్‌ పేమెంట్లకు ఇబ్బంది కలుగుతుందని, దీంతో యూజర్లకు పేమెంట్లు చేసే విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయని ఆయా సంస్థలు చెబుతున్నాయి. అయినప్పటికీ ఆర్‌బీఐ దీనిపై ముందుకు వెళ్లడానికే సిద్ధమవుతోంది. కార్డుల ఫ్రాడ్‌లను అరికట్టేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఈ క్రమంలో ఆయా సంస్థలకు చెందిన సైట్లు, యాప్‌లలో వినియోగదారులకు చెందిన కార్డుల వివరాలు ఇకపై స్టోర్‌ అవ్వవు. ప్రతి సారీ కార్డుల వివరాలను ఎంటర్‌ చేయాల్సిందే..!

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...