సిబిఐ విచారణ చేయాలంటే రాష్ట్రాల అనుమతి కావాల్సిందే: సుప్రీం కోర్ట్

-

సిబిఐ దర్యాప్తు విషయంలో సుప్రీం కోర్ట్ కీలక విషయం చెప్పింది. సిబిఐ దర్యాప్తు రాష్ట్రాల్లో చేయాలి అంటే రాష్ట్రాల అనుమతి తప్పనిసరి అని సుప్రీం కోర్ట్ స్పష్టం చేసింది. రాష్ట్రాల అనుమతి లేకుండా సిబిఐ పరిధిని తాము పెంచలేమని సుప్రీం కోర్ట్ పేర్కొంది. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద ఉన్న సిబిఐకి తన అధికారాన్ని మరియు అధికార పరిధిని వినియోగించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ సమ్మతి అవసరమని సుప్రీం కోర్ట్ నేడు వెల్లడించింది.

ఈ నిబంధనలు రాజ్యాంగంలోని సమాఖ్య స్వభావానికి అనుగుణంగా ఉన్నాయని పేర్కొంది. రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, కేరళ, మహారాష్ట్ర సహా కొన్ని రాష్ట్రాలు సిబిఐని రాష్ట్రంలోకి అడుగు పెట్టకుండా ఆదేశాలు ఇచ్చాయి. సిబిఐ ద్వారా తమను ఇబ్బంది పెడుతున్నారు అని రాష్ట్రాలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news