అప్పుల లెక్కలు చెప్పిన హరీశ్‌రావు… అమ్మకాల లెక్కలు చెప్పట్లేదు: రేవంత్‌రెడ్డి

-

రాష్ట్ర శాసనసభ సమావేశాలు నాలుగో రోజు వాడివేడిగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా చర్చ మొదలుపెట్టిన హరీశ్ రావు ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతుంటే.. ప్రభుత్వం దీటుగా స్పందిస్తోంది. ఈ క్రమంలో హరీశ్ రావుపై సీఎం రేవంత్ ధ్వజమెత్తారు. అబద్ధాలతో హరీశ్‌రావు ఊకదంపుడు ఉపన్యాసం ఇస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను మభ్య పెట్టాలని చూస్తే వారు నమ్మడానికి సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. ప్రజలు శిక్షించినా వాళ్ల ఆలోచన మారలేదని అన్నారు.

‘లక్షల కోట్ల విలువైన ఓఆర్‌ఆర్‌ను రూ.7వేల కోట్లకే తెగనమ్మారు. గొర్రెల పంపిణీ పథకం పేరుతో రూ.కోట్లు దండుకున్నారు. గొప్ప పథకం అని చెప్పిన బతుకమ్మ చీరల్లోనూ అవినీతికి జరిగింది. ఆడబిడ్డల సెంటిమెంట్‌నూ దోపిడీకి ఉపయోగించుకున్నారు. కురుమ, యాదవులను అమాయకులను చేసి కోట్లు దోచుకున్నారు. ఎన్ని వేల కోట్ల విలువైన భూములు అమ్మారో లెక్క తీద్దాం. అప్పుల లెక్కలు చెబుతున్నారు.. కానీ అమ్ముకున్న లెక్కలు చెప్పట్లేదు. పదేళ్లలో పాలమూరుకు చేసిందేం లేదు. రూ.20లక్షల కోట్లకు పైగా ఖర్చుపెట్టినా పాలమూరు ప్రాజెక్టులు పూర్తి కాలేదు.’ అని రేవంత్ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news