స్టాక్ మార్కెట్ బుధ వారం మార్నింగ్ సెషన్ లాభాలతో మొదలైంది. బీఎస్ఈ సెన్సెక్స్ 200 పాయింట్ల కు పైగా ఈ సెషన్ లో లాభం తో మొదలైంది. ప్రస్తుతం బీఎస్ఈ సెన్సెక్స్ 60,234 వద్ద ట్రేడ్ అవుతుంది. దీంతో పాటు ఎన్ ఎస్ఈ నీఫ్టీ కూడా మార్నింగ్ సెషన్ లో లాభంతో ప్రారంభించింది. ప్రస్తుతం ఎన్ఎస్ఈ నిఫ్టీ దాదాపు 57 పాయింట్లు పెరిగింది. దీంతో ఎన్ఎస్ఈ నిఫ్టీ 17,946 వద్ద కొనసాగుతోంది.
అయితే ముఖ్యంగా ఈ రోజు టెక్ మహీంద్రా, ఎన్ టీపీసీ, ఎల్ అండ్ టీ, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ పిన్ సెర్వ్, ఎస్ బీఐఎన్ లాభాల్లో కొనసాగుతున్నాయి. అలాగే పలు షేర్లు కూడా నష్టల్లో ట్రెడ్ అవుతున్నాయి. టైటాన్, సన్ ఫార్మా, హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకు, ఏసీయన్ పెయింట్స్ తో పాటు హిందుస్థాన్ యూనిలివర్ షేర్లు నష్ట లలో ట్రేడ్ అవుతున్నాయి. అయితే షేర్ మార్కెట్లలో ట్రేడ్ చేస్తున్న వారు ఈ విషయం తెలుసుకుని లాభం లో ఉన్న కంపెనీల పై ఇన్వెష్ట్ చేయాండి.