షాకింగ్ న్యూస్… భారత్ కు సూపర్ సైక్లోన్స్ ముప్పు

-

ప్రతీ ఏడాది భారత్ తీర ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాలపై తుఫానులు విరుచుకుపడుతున్నాయి. ఇటీవల వచ్చిన అసనీ తుఫాన్ కూడా తీర ప్రాంత ప్రజలను చాలా భయపెట్టింది. అంతకు ముందు వచ్చిన అంఫన్, నిసర్గ, తౌక్టే ఇలా తుఫానులు భారత్ పై విరుచుకు పడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏర్పడే తుఫానుల వల్ల తీర ప్రాంతాలు దెబ్బతింటున్నాయి. తమిళనాడు, ఒడిశా, ఆంధ్ర ప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర తీరాలు ప్రతీ ఏడాది తుఫానుల తాకిడిని అనుభవిస్తున్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ శాస్త్రవేత్తలు షాకింగ్ న్యూస్ చెప్పారు. రానున్న రోజుల్లో భారత్ ను సూపర్ సైక్లోన్స్ దెబ్బతిస్తాయని ఓ నివేదికలో వెల్లడించారు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా గంటకు 220 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. 2020లో వచ్చిన ‘ అంఫన్‘ తుఫాను కన్నా 250 శాతం తీవ్రమైన తుఫానులు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చిరించింది.

Read more RELATED
Recommended to you

Latest news