ప్రధాని వస్తున్నారని కెసిఆర్ కర్ణాటకకు పోయి దాక్కున్నారు: విజయశాంతి

-

ప్రధాని రాకతో తెలంగాణలో కొత్త మార్పు స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు బీజేపీ నేత విజయశాంతి. శనివారం ఫేస్బుక్ వేదికగా స్పందిస్తూ.. నగరానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాకతో తెలంగాణలో కాషాయ శకం ప్రారంభమైందని అన్నారు. కుటుంబ పాలన లో తెలంగాణ బందీ అయ్యిందని, కెసిఆర్ నియంతృత్వ పాలనపై ప్రధాని ద్వజమేత్తారన్నారు. కుటుంబ పాలనను, పార్టీలను తరిమేస్తేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని మోడీ, తెలంగాణ ప్రజలు స్పష్టం చేసినట్లు చెప్పారు.

ప్రధాని వస్తున్నారు అంటేనే సీఎం కేసీఆర్ కు వెన్నులో వణుకు పుడుతోందని.. అందుకే కర్ణాటకకు పోయి దాక్కున్నారని రాములమ్మ దుయ్యబట్టారు. కెసిఆర్ కు ఏం పని ఉందని బెంగళూరు వెళ్లారని ప్రశ్నించారు. సమస్యలు ఉంటే మోడీని సీఎం నేరుగా కలిసి చెప్పుకోవచ్చు కదా..? అది చెయ్యరు. ప్రతి దానికి కేంద్రం పైన, ప్రధాన పైన ఆరోపణలు చేయడం తప్ప ఇంకేదీ చేతకాదు అని మండిపడ్డారు. తెలంగాణలో పార్టీ కోసం కార్యకర్తలు పోరాడుతున్న తీరును మోదీ ప్రస్తావించడంతో.. కాషాయ దళం లో కొత్త కళ కనిపించింది అన్నారు. ఇదే ఉత్సాహంతో కేసీఆర్ ను గద్దె దించి కాషాయ జెండా ని ఎగరేస్తామని విజయశాంతి ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news