మణిపూర్ లో హింసపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

-

మణిపూర్ లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు, అల్లర్లతోపాటు మహిళలను ఊరేగించిన ఘటన దేశాన్ని కుదిపేసింది. ఈ ఘటనలపై నేడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. మణిపూర్ లో హింసపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దర్యాప్తునకు మహిళా జడ్జితో సిట్ ఏర్పాటు చేయనున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. సిట్ లోని మహిళా న్యాయమూర్తులు మణిపూర్ రాష్ట్రంలో పర్యటించి అక్కడి బాధితులతో మాట్లాడతారని సీజేఐ చంద్రచూడ్ ధర్మాసరం స్పష్టం చేసింది.

ఇక మణిపూర్ లో జరుగుతున్న హింస జాతి హింస కాదని, మయన్మార్ నుంచి వస్తున్న డ్రగ్స్ అక్రమ రవాణాకు సంబంధించిందని మైతేయ్ కమ్యూనిటీ సంస్థ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ని ధర్మాసనం తిరస్కరించింది. వాస్తవాలను జోడించి పిటిషన్ దాఖలు చేయాలని పిటీషనర్లకు సిజెఐ సూచించింది.

Read more RELATED
Recommended to you

Latest news