కేసీఆర్ అనాలోచిత నిర్ణయాల వల్లే భారీ నష్టం – భట్టి విక్రమార్క

-

సీఎం కేసీఆర్ అనాలోచిత నిర్ణయాల వల్లే భారీ నష్టం జరిగిందని అన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వాతావరణ హెచ్చరికలు ఉన్నా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే వర్షాల వల్ల భారీ నష్టం జరిగిందన్నారు. సరైన మెయింటెనెన్స్ లేకపోవడం వల్లే 60 చెరువులు తెగిపోయాయని.. ఆ కారణంగానే మొరంచపల్లి పూర్తిగా నీట మునిగిందని మండిపడ్డారు.

వర్షాల వల్ల జరిగిన నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ వచ్చాక ఇరిగేషన్ ప్రాజెక్టులు సాంకేతికతతో కాకుండా రాజకీయ, ఆర్థిక అవసరాల కోసం కట్టారని మండిపడ్డారు. ప్రజలు ఇబ్బందులలో ఉన్నప్పుడు హెలిక్యాప్టర్ ఇవ్వమంటే స్పందించలేదు కానీ.. రాజకీయ అవసరాల కోసం పక్క రాష్ట్రాలకు ప్రత్యేక విమానాలు పంపి నాయకులను రప్పించుకొని కండువాలు కప్పుతారని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news