బీజేపీకి తలనొప్పిగా మారిన సీట్ల సర్దుబాటు

-

2024 లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ తన మిత్రపక్షాలను సిద్ధం చేస్తోంది. బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) ఎంపీలతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు. ఆగస్టు 10 వరకు జరిగే ఈ సమావేశాల్లో 2024లో జరగనున్న లోక్ సభ ఎన్నికల అంశంపై చర్చించనున్నారు. ప్రధానితో భేటీ కోసం బీజేపీ నేతలు ఎన్డీయే ఎంపీల 10 గ్రూపులుగా సిద్ధం చేశారు. తొలి సమావేశంలో పశ్చిమ ఉత్తరప్రదేశ్, బుందేల్ ఖండ్, బ్రజ్ ప్రాంతాల ఎంపీలతో ప్రధాని చర్చిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

BJP-party

ముందుగా మహారాష్ర్టకు చెందిన ఎంపీల భేటీతో ఈ కార్యక్రమం మొదలైంది. ఈ సమావేశంలో మోడీతో పాటు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, హోంమంత్రి అమిత్ షా కూడా ఉన్నారు.పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన ఎన్డీయే ఎంపీలతో ప్రధాని రెండో సమావేశం నిర్వహించనున్నారు.ఎన్డీయే నేతలతో సమన్వయం చేసుకునే బాధ్యతను బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో పాటు కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌లకు ప్రధాని మోడీ అప్పగించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఉత్తరప్రదేశ్‌లో అత్యధిక లోక్‌సభ స్థానాలు ఉన్నందున ఇక్కడి బీజేపీ ఎంపీలతో సమావేశాన్ని ఎన్‌డిఏ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సారి యుపీలో 80 ఎంపీ స్థానాలను గెలుచుకునే లక్ష్యంతో బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది.ఇక్కడ మిషన్ 80కి సిద్ధమవుతున్న బీజేపీ.. ఇక్కడి నుంచి అన్ని స్థానాల్లో విజయం సాధించి ఆధిక్యాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తోంది. అయితే సుభాష్ప, అప్నా దళ్ (ఎస్), నిషాద్ పార్టీ కలిసి రావడంతో సీట్లు పంచుకోవడం తప్పనిసరిగా మారింది. త్వరలో కొన్ని కొత్త ప్రాంతీయ పార్టీలు కూడా ఇందులో భాగం కావచ్చు. అటువంటి పరిస్థితిలో, సీట్ల సమన్వయం వల్ల పార్టీకి సమస్యలు పెరిగే అవకాశం ఉంది. గత లోక్‌సభ ఎన్నికల్లోనే అప్నాదళ్ ఎక్కువ సీట్లను క్లెయిమ్ చేయడం ద్వారా బిజెపి కొంత నష్టపోయింది. ఈ సారి అలాంటి అవకాశం ఇవ్వకుండా సీట్ల పంపకాల్లో పక్కాగా వ్యవహరించనున్నారు.

అటు ఈశాన్య రాష్ర్టాల్లో కూడా చిన్న పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి మిత్రపక్షాల బలాన్ని మరింత పెంచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.అయితే ఈ ఎత్తుగడ బీజేపీని ఇబ్బందుల్లోకి నెట్టిందనే చెప్పాలి.ఈశాన్య రాష్ట్రాల్లో మొత్తం 26 సీట్లు ఉన్నాయి. అక్కడి పార్టీలన్నింటికీ ఎన్‌డిఏలోభాగస్వామ్యం కల్పించాలంటే ఒక్కో పార్టీకి కనీసం ఒక్క సీటు అయినా కేటాయించాలి. ఇలా చేయడం వలన బీజేపీ సొంతగా పోటీ చేయాల్సిన సీట్లు భారీగా తగ్గే అవకాశం ఉంది.తెలుగు రాష్ర్టాల్లో కలిసి వచ్చే పార్టీల విషయంలో కొంత గందరగోళ పరిస్థితి కొనసాగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news