ఆ ఫైళ్లు సమర్పించండి.. దిల్లీ లిక్కర్ కేసులో ఈడీకి సుప్రీంకోర్టు ఆదేశాలు

-

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సుప్రీంకోర్టు ఈడీ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. మద్యం కుంభకోణంలో కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌‌పై ఇవాళ (మే 7వ తేదీ) విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం .. ఈ కేసులో నిజానిజాల్ని వెలికితీయడానికి రెండేళ్ల సుదీర్ఘ సమయాన్ని ఎందుకు తీసుకున్నారని ఈడీని ప్రశ్నించింది. సాక్షులు, నిందితులకు డైరెక్ట్ ప్రశ్నలను ఎందుకు అడగలేదని నిలదీసింది. దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా అరెస్టుకు ముందు, తర్వాత లిక్కర్ స్కాం కేసు ఫైళ్లను తమకు సమర్పించాలని ఈడీ అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాహి వాదిస్తూ.. “ఈ కేసులో విచారణ మొదలుపెట్టిన కొత్తలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరు పెద్దగా బయటకు రాలేదు. విచారణ లోతుగా జరిగే కొద్దీ ఆయన పాత్ర ఉందనే విషయం తేటతెల్లమైంది. 2022 గోవా అసెంబ్లీ ఎన్నికల సమయంలో గోవాలోని 7 స్టార్ హోటల్‌ ‘గ్రాండ్ హయత్’లో సీఎం అరవింద్ కేజ్రీవాల్ బస చేశారు. దానికి సంబంధించిన బిల్లులో కొంత భాగాన్ని దిల్లీ ప్రభుత్వ సాధారణ పరిపాలనా విభాగం, ఇంకొంత భాగాన్ని ఆప్ ప్రచారానికి నిధులు సేకరించిన చన్‌ప్రీత్ సింగ్ చెల్లించారు. ఇది రాజకీయ ప్రేరేపిత కేసు కాదు” అని సుప్రీంకోర్టుకు స్పష్టం చేశారు. .

Read more RELATED
Recommended to you

Latest news