బ్రేకింగ్: సుప్రీంకు రావాలని అద్వానీకి ఆదేశాలు

90వ దశకం ప్రారంభంలో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన కేసు తుది దశకు చేరుకుంది. సుప్రీం కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ మురళీ, మనోహర్ జోషి, కళ్యాణ్ సింగ్, ఉమా భారతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వారిని నిందితులుగా కూడా సుప్రీంకోర్టు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ నెల 30న ఈ కేసు తీర్పు రానుంది.

దీనితో 30న బాబ్రీ మసీదు కూల్చివేత నిందితులు ఎల్కే అద్వానీ మురళీ మనోహర్ జోషి కళ్యాణ్ సింగ్ ఉమా భారతి కోర్టుకు హాజరు కావాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ తీర్పుపై ఇప్పుడు దేశం మొత్తం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. కాగా బాబ్రీ మసీదు స్థానంలో… రామాలయం నిర్మిస్తున్నారు.