టీమిండియా Mr. 360 సూర్య కుమార్ కెమెరామెన్ అవతారం ఎత్తి ముంబై మెరైన్ డ్రైవ్ లో అభిమానులను ఇంటర్వ్యూ చేశారు. ఆయన మాస్క్, క్యాప్ ధరించడంతో ఎవరూ గుర్తించలేదు. అయితే ఓ అభిమాని SKY అభిమానని చెప్పడంతో మాస్క్ తీసి ఆమెకు ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాన్ని అందించారు.
![Suryakumar Yadav Turns Cameraman](https://cdn.manalokam.com/wp-content/uploads/2023/11/Suryakumar-Yadav-Turns-Cameraman.jpg)
ఈ వీడియోను బీసీసీఐ తన వెబ్సైట్లో పంచుకుంది. వరల్డ్ కప్ లో రేపు శ్రీలంకతో జరిగే మ్యాచ్ కోసం టీమిండియా ముంబైకి చేరుకుంది. ఇది ఇలా ఉండగా..గాయంతో దూరమైన హార్దిక్ పాండ్యా దాదాపు కోలుకున్నారు. వచ్చే 5న జరిగే సౌత్ ఆఫ్రికా మ్యాచ్ తో జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఆయన రాకతో ఎవరిపై వేటు పడనుందన్నది ఆసక్తికరంగా మారింది. నిజానికి సూర్యనే తప్పించాల్సి ఉన్న, గత మ్యాచ్ లో పరిణతి కలిగిన ఆటతో ఆయన ఆకట్టుకున్నారు. అటు అయ్యర్ రన్స్ చేయడంలో వరుసగా విఫలం అవుతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీలంక మ్యాచ్ లో ప్రదర్శన బట్టి ఈ అంశంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.