దేశ వ్యాప్తంగా నేడు జేఈఈ అడ్వాన్స్ పరీక్ష నిర్వహించారు. సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ సెంటర్లో సాంకేతిక సమస్యలు రావడంతో ఆలస్యంగా పరీక్ష నిర్వహించారు. ఉదయం 9గం. ల నుంచి 12గం.ల వరకు పరీక్ష నిర్వహించాల్సి ఉంది. కానీ సీఎంఆర్ సెంటర్లో మాత్రం 9.45గం. లకు ప్రారంభమై 12.45 వరకు కొనసాగింది పరీక్ష. 2.30గం.లకు ప్రారంభం కావాల్సిన సెకండ్ పేపర్ మధ్యాహ్నం 3గం. లకు వాయిదా వేసారు నిర్వాహకులు.
విద్యార్థుల బయోమెట్రిక్ తీసుకోవడంలో సాంకేతిక ఇబ్బందులు వచ్చాయి. విద్యార్థుల బయోమెట్రిక్ పరీక్షకు ముందు కాకుండా పరీక్ష అయ్యాక తీసుకున్నారు పరీక్ష నిర్వాహకులు. ఫోటో ఐడి, పాస్వర్డ్ ను గుర్తించడంలోనూ సాంకేతిక సమస్యలు ఎక్కువగా వచ్చాయి. పరీక్ష నిర్వహణలో సర్వత్రా నిర్లక్ష్యం కనపడుతుంది అని ఆరోపణలు వచ్చాయి.