తీస్తా సీతల్వాద్​కు సుప్రీంకోర్టులో ఊరట

-

ప్రముఖ సామాజిక కార్యకర్త తీస్తా సీతల్వాద్‌కు సుప్రీం కోర్టులో ఈరట లభించింది. వెంటనే లొంగిపోవాలన్న గుజరాత్‌ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం కోర్టు వారం రోజుల పాటు స్టే విధించింది. 2002 గుజరాత్ అల్లర్ల కేసులో తీస్తా బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన గుజరాత్ హైకోర్టు.. వెంటనే లొంగిపోవాలని ఆదేశించింది. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్‌ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ఇద్దరు న్యాయమూర్తుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో త్రిసభ్య ధర్మాసనానికి పిటిషన్‌ బదిలీ అయ్యింది.

శనివారం రాత్రి దీనిపై జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిజ్‌ ఏఎస్‌ బోపన్న, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత… సుప్రీంకోర్టు బెంచ్‌ వెంటనే లొంగిపోవాలన్న గుజరాత్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. తీస్తా సెతల్వాడ్‌కు ఏడు రోజుల మధ్యంతర రక్షణ కల్పిస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. చట్ట ప్రకారం మహిళగా ప్రత్యేక రక్షణ పొందేందుకు తీస్తా సీతల్వాద్‌కు అర్హత ఉందని సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది.

Read more RELATED
Recommended to you

Latest news