ఆ బీజేడీ ఎమ్మెల్యే పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన యువతి

-

ఒడిషాలోని సీనియర్ బీజేడి నాయకుడు, మాజీ మంత్రి దివంగత బిష్ణుదాస్ కుమారుడు బిజయ్ శంకర్ దాస్, సోమాలిక అనే యువతితో చాలా కాలంగా ప్రేమలో ఉన్నాడు. వీరిద్దరూ మే 17న జగత్ సింగ్ పూర్ లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పెళ్లి చేసుకోవడానికి దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తును పరిశీలించిన అధికారులు జూన్ 17 శుక్రవారం పెళ్లి రిజిస్టర్ చేయడానికి స్లాట్ ఇచ్చారు.

దీంతో శుక్రవారం జూన్ 17వ తేదీ అనుకున్న సమయానికి సోమాలిక రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకున్నారు. కానీ ఎమ్మెల్యే బిజయ్ శంకర్ దాస్ కాని, అతని కుటుంబ సభ్యులు కానీ రిజిస్టర్ ఆఫీస్ కి రాలేదు. కాగా ఎమ్మెల్యే తనను మోసం చేశాడని ఆరోపిస్తూ సోమాలిక జగత్ సింగ్ పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులు తనను బెదిరిస్తున్నారని ఆమె ఆరోపించింది. నెల రోజుల క్రితం రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి రిజిస్ట్రేషన్ కోసం సంతకం పెట్టాడానికి వచ్చాడని.. ఈ నెల రోజుల్లో ఏమైందో తెలియదు అని సోమాలిక చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news