బీజేపీలోకి టీడీపీ విలీనం కానుందా.. పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయవచ్చని, 2029లోగా బీజేపీలోకి, జనసేన పార్టీలోకి టీడీపీని వీలినం కానున్నట్లు బీజేపీ వెల్లడించిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. టీడీపీ పార్టీ బీజేపీలోకి విలీనమైతే.. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కావొచ్చని బీజేపీ ఆకాశంలో నక్షత్రాలను చూపిస్తోంది. 2024 ఎన్నికల్లో టీడీపీ పార్టీని ఎన్నికల నుంచి దూరమైతే.. 2029 ఎన్నికల్లో బీజేపీ లేదా జనసేన పార్టీ గెలుపు ఖాయమన్నారు.

పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్

అయితే జనసేన పార్టీ అధినేత వైసీపీ పార్టీలోకి విలీనం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఢిల్లీ పెద్దలు చెబుతున్నారు. కాగా, కొద్దిరోజులుగా ఏపీలో వైసీపీ, జనసేన పార్టీ మధ్య పెద్ద పోరు నడుస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలడం వల్లే గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చినట్లు జనసేనాని ప్రకటించాడు. తెలుగుదేశం పార్టీకి మూడు ఆప్షన్లు ఇచ్చినట్లు జనసేనాని పేర్కొన్నారు. ఏపీలో వైసీపీ గద్దె దించాలంటే టీడీపీలో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లాల్సిందేనని పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై బీజేపీ నేతలు స్పందించడం లేదన్నట్లు సమాచారం.