హిందీ ‘హిట్’ ట్రీట్‌మెంట్ చేంజ్‌డ్..పాత్రలో ఒదిగిపోయిన్ రాజ్ కుమార్ రావు

-

టాలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ ‘హిట్’..బాలీవుడ్ లో రీమేక్ అయింది. ఒరిజినల్ దర్శకుడు డాక్టర్ శైలేశ్ కొలనుయే హిందీ సినిమాకూ దర్శకత్వం వహించారు. కాగా, తెలుగులో విడుదలైన చిత్రానికి, హిందీలో విడుదల కాబోతున్న సినిమాకు కొంత ట్రీట్ మెంట్ చేంజ్ చేసినట్లు విడుదలైన ట్రైలర్ ను బట్టి సినీ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. టీ సిరీస్ గుల్షన్ కుమార్ తో కలిసి ప్రొడ్యూస్ చేశారు. వచ్చే నెల 15న ఈ పిక్చర్ విడుదల కానుంది. బాలీవుడ్ స్టార్ హీరో రాజ్ కుమార్ రావు..ఇందులో నటించారు. ఆయనకు జోడీగా సన్యా మల్హోత్ర నటించింది.

తెలుగులో విశ్వక్ సేన్ పాత్రకు..హిందీలోని రాజ్ కుమార్ రావు పాత్రకు పోలికలు ఉన్నప్పటికీ ట్రీట్ మెంట్ కొంత డిఫరెంట్ గా ఉందని స్పష్టమవుతోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ మూవీ సక్సెస్ పైన మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news