కార్లలో ఎయిర్‌ బ్యాగ్స్‌ నిబంధనపై వెనక్కు తగ్గిన కేంద్రం..ఎప్పటికి వాయిదా అంటే..

కేంద్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాలను తగ్గించే చర్యల్లో భాగంగా ఈమధ్య కొన్ని కొత్త కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. మొన్న కార్లో అన్నీ సీట్‌ బెల్టులకు అలారం ఉండాలని నిర్ణయించింది. కార్లలో కచ్చితంగా ఆరు ఎయిర్‌ బ్యాగ్స్‌ ఉండాలని కూడా నిబంధన తీసుకొచ్చి ఈ ఏడాది అక్టోబర్‌ 1 నుంచి వచ్చే కార్లలో ఇలా ఉండాలని ఆదేశించింది. అయితే ఈ నిబంధనపై కేంద్రం మరో నిర్ణయం తీసుకుంది.

గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ ఏడాది అక్టోబర్‌ 1వ తేదీ నుంచి ఈ నిబంధన తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో వచ్చే అక్టోబర్‌ నుంచి ఈ నిబంధనను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం కసరత్తు కూడా చేసింది. కానీ తాజాగా ఈ నిర్ణయంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కార్లలో ఆరు ఎయిర్‌ బ్యాగుల నిబంధనను ఈ ఏడాది అక్టోబర్‌ 1 నుంచి కాకుండా వచ్చే ఏడాదికి వాయిదా వేసింది. అంటే 2023 అక్టోబర్‌ 1 నుంచి ఈ కొత్త నిబంధనను అమలు చేయనున్నారనమాట. ఈ విషయమై కేంద్ర రోడ్డు రవాణ, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు.

సరఫరాలో పరిమితులతో ఆటో ఇండస్ట్రీ ఎదుర్కొంటొన్న ఇబ్బందులు, స్థూల ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకొని ప్రయాణికుల కార్లలో కనీసం 6 ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేసే ప్రతిపాదనను 2023 అక్టోబర్ 1 నుంచి అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి ట్వీట్‌ చేశారు..ధర, వేరియంట్లతో సంబంధం లేకుండా ఎయిర్‌బ్యాగులను అమలు చేయాలని మంత్రి ట్వీట్‌లో తెలిపారు.

దేశీయ కార్ల కంపెనీలు చాలా వరకు విదేశాలకు ఎగుమతి చేసే వాటిలో ఆరు ఎయిర్‌ బ్యాగ్స్‌ను ఏర్పాటు చేస్తున్నాయి. కానీ దేశీయంగా మాత్రం ఈ విధానాన్ని అమలు చేయడం లేదు. దీంతో ఈ విషయంపై కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వాహన తయారీ సంస్థలు ప్రజల ప్రాణాలను ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదంటూ గతంలోనే ఆగ్రహం వ్యక్తం చేశారు.
Attachments area