కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన తీవ్ర అంతరాయం కారణంగా భారతీయ విమానయాన సంస్థల ఆదాయం 85 శాతం తగ్గి 3,651 కోట్ల రూపాయలకు చేరుకుందని కేంద్ర విమానయాన శాఖా మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి బుధవారం రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. భారత విమానయాన సంస్థలు 85.7 శాతం ఆదాయ నష్టాన్ని చవిచూశాయని ఆయన తెలిపారు.
భారత క్యారియర్ లలో ఉద్యోగుల సంఖ్య మార్చి 31 న 74,887 నుండి జూలై 31 న 69,589 కు తగ్గిందని అన్నారు. ఇది 7.07 శాతం తగ్గిందని చెప్పారు. విమానాశ్రయ నిర్వాహకుల ఆదాయం 2019 ఏప్రిల్-జూన్ కాలంలో రూ .5,745 కోట్ల నుంచి 2020 ఏప్రిల్-జూన్ కాలంలో రూ .884 కోట్లకు తగ్గిందని వివరించారు. విమానాశ్రయాలలో ఉద్యోగుల సంఖ్య కూడా మార్చి 31 న 67,760 నుండి జూలై 31 న 64,514 కు తగ్గిందని పూరి చెప్పారు.