నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం..త్వరలో 10 లక్షల ఉద్యోగాలు

-

నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం. దేశవ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని ప్రధాని నరేంద్రమోడీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏడాదిన్నర కాలంలో మోడీ ప్రభుత్వం 10 లక్షల ఉద్యోగాలు ఇవ్వనుందని మంగళవారం ఉదయం ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోడీ అన్ని శాఖలు, మంత్రిత్వశాఖను సమీక్షించిన గా తెలుస్తోంది.

వచ్చే ఏడాది కాలంలో మిషన్ మోడ్ లో పది లక్షల మందిని నియమించాలని పీఎం మోడీ ఆదేశించారని పీఎంవో ట్వీట్ చేసింది. నిరుద్యోగ సమస్యపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నిర్ణయంగా ఇది చెప్పవచ్చు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ పీఎంవో తరఫున ఉద్యోగ ప్రకటన పై ట్వీట్ చేశారు.దేశంలో నిరుద్యోగ సమస్యపై విపక్షాలు తరచూ ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రభుత్వ రంగంలో వివిధ భాగాల్లో ఉన్న ఖాళీల గురించి కేంద్రం దృష్టికి తీసుకువస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే అన్ని ప్రభుత్వ శాఖల్లో మానవ వనరుల స్థితిగతులను సమీక్షించిన మీదట మోడీ నుంచి ఈ కీలక ప్రకటన వెలువడింది.

Read more RELATED
Recommended to you

Latest news