ఇండియాలో ప్రపంచంలోనే అతిపెద్ద అణు కర్మాగారం, మేము రెడీ అంటున్న ఫ్రాన్స్ కంపెనీ

-

భారతదేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద అణు విద్యుత్ ప్లాంట్‌ ను నిర్మించడానికి ఫ్రెంచ్ ఎనర్జీ గ్రూప్ ఇడిఎఫ్ శుక్రవారం ఒక కీలక అడుగు వేసింది. గత కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్ట్ పై విపక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. పశ్చిమ భారతదేశంలోని జైతాపూర్‌లో ఆరు, మూడవ తరం ఇపిఆర్ రియాక్టర్లను నిర్మించేందుకు పరికరాలను సరఫరా చేయడానికి బైండింగ్ ఆఫర్‌ను దాఖలు చేసినట్లు కంపెనీ తెలిపింది.

ఈ ప్రాజెక్ట్ పూర్తి అయిన తర్వాత 10 గిగావాట్ల (జిడబ్ల్యు) విద్యుత్తును అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. నిర్మాణానికి 15 సంవత్సరాలు పడుతుందని భావిస్తున్నారు. అయితే సైట్ పూర్తి కావడానికి ముందే విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించగలగాలని నిపుణులు చెప్తున్నారు. ప్రభుత్వ యాజమాన్యంలోని పిఎస్‌యు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అణు ఇంధన రంగాన్ని నియంత్రిస్తుంది. అయితీ ప్రాజెక్ట్ వ్యయం మాత్రం ఇప్పటి వరకు బయటపెట్టలేదు.

Read more RELATED
Recommended to you

Latest news