Corona Virus కరోనా మహమ్మారి కారణంగా చాలా సమస్యలతో మనం ఇబ్బంది పడ్డాము. ఈ మేరకు కేంద్రం కొన్ని అవసరమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కొన్ని ముఖ్యమైన విషయాల్లో కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టి ఈ మేరకు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మరి ఇక వాటి కోసం చూస్తే…
కరోనా వైరస్ మహమ్మారి వలన ఇబ్బంది పడిన వ్యక్తులకు మరియు వ్యాపారానికి సహాయం చేయడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎనిమిది ఆర్థిక సహాయ చర్యలను ప్రకటించారు.
వాటి వివరాలు ఇవే:
కోవిడ్ ప్రభావిత రంగాలకు 1.1 లక్షల కోట్ల రుణ హామీ పథకాన్ని ఫైనాన్స్ మినిస్టర్ ప్రకటించారు.
లోన్ గ్యారంటీ పథకం తో పాటు ఆరోగ్య శాఖకి రూ .50,000 కోట్లు.
మైక్రో ఫైనాన్స్ సంస్థల ద్వారా 25 లక్షల మందికి క్రెడిట్ హామీ పథకం
క్రెడిట్ హామీ పథకం కొత్త రుణాలపై దృష్టి పెట్టడం, పాత వాటిని తిరిగి చెల్లించటం కాదు.
అత్యవసర క్రెడిట్ లైన్ గ్యారెంటీ పథకం కోసం అదనంగా రూ .1.5 లక్షల కోట్లు ప్రకటించింది కేంద్రం.
పర్యాటక రంగానికి ఉపశమన ప్యాకేజీ 11,000 నమోదిత పర్యాటక మార్గదర్శకులకు ఆర్థిక సహాయం. 100% ప్రభుత్వంతో రుణాలు ట్రావెల్ అండ్ టూరిజం వాటాదారులకు రూ .10 లక్షల వరకు మరియు రూ.1 లక్ష టూరిస్ట్ గైడ్లకు హామీ.
5,00,000 మంది పర్యాటకులకు ఉచిత పర్యాటక వీసా. ఈ పథకం 2022 మార్చి 31 వరకు వర్తిస్తుంది.